Sorry, you are not allowed to access this page
బొందుగుల
  • Ram Nath Kovind Our President
  • Narendra Modi Our Prime Ministe
  • SMT amilisai Soundararajan Our Governer
  • K Chandrashekar Rao Our Chief Minister
  • Komatireddy Venkat Reddy Our MP
  • Smt Gongidi Sunitha Our MLA

మన గ్రామం గురించి

బొందుగుల గ్రామం గురించి

బొందుగుల గ్రామము తెలంగాణ రాష్ట్రము లో కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట మండలములో ఉన్నది. మండల కేంద్రమైన రాజాపేట నుండి 8 కిలోమీటర్ల దూరములో మరియు జిల్లా కేద్రమైన భువనగిరి నుండి 40 కిలోమీటర్ల దూరములో ఉన్నది. బొందుగుల గ్రామము 2413 హెక్టార్లలో విస్తరించి ఉన్నది. బొందుగుల గ్రామము మొత్తం  

జనాభా 3467 . 2011 జనాభా లెక్కల ప్రకారం  మొత్తం జనాభా లో 1728 మంది పురుషులు మరియు 1739 మంది స్త్రీలు ఉన్నారు. గ్రామములో సుమారుగా మొత్తం ఇల్లు 819 ఉన్నాయి. బొందుగుల గ్రామము పిన్ కోడ్ 508105 మరియు ముఖ్య తపాలా కార్యాలయము రఘునాథపురం గ్రామములో ఉన్నది. గోదుమకుంట మరియు తిమ్మరాజిగూడెం లు బొందుగుల గ్రామానికి ఉప గ్రామాలుగా ఉన్నాయి. 

బందుగుల గ్రామములో శ్రీ వెంకటేశ్వర ఆలయము, శివాలయము, వేణుగోపాలస్వామి ఆలయము ముఖ్య ఆలయాలుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజు శ్రీ వెంకటేశ్వర ఆలయము లో గ్రామస్తులు అందరు కలసి జాతర ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరకు ఇతర గ్రామాలనుండి కూడా భక్తులు విశేష సంఖ్యలో వస్తారు.


బొందుగుల గ్రామానికి 5 కిలోమీటర్ల దూరములో నెమిల, 6  కిలోమీటర్ల దూరములో సోమారం,  8  కిలోమీటర్ల దూరములో రాజాపేట, 7  కిలోమీటర్ల దూరములో పాముకుంట, 6   కిలోమీటర్ల దూరములో జాల గ్రామాలు ఉన్నాయి. బొందుగుల గ్రామానికి తూర్పులో బచ్చన్నపేట మండలము, పడమరలో జగదేవపూర్ మరియు ఎం తుర్కపల్లి మండలాలు మరియు ఉత్తరంలో చేరియాల్ మండలాలు ఉన్నాయి. 
 

బొందుగుల గ్రామము - పర్యావలోకనం :

గ్రామ పంచాయతీ బొందుగుల
మండలము రాజాపేట
జిల్లా  యాదాద్రి భువనగిరి
రాష్ట్రం  తెలంగాణ
దేశము   భారతదేశం
భాష  తెలుగు, ఉర్దూ మరియు ఇంగ్లీష్
సమయ మండలం  IST (UTC 5:30)
సముద్ర మట్టానికి ఎత్తు     366 మీటర్లు
అక్షాంశము      17.771942
రేఖాంశం  78.966122
టెలిఫోన్ / ఎస్టీడీ కోడ్  08685
తపాలా సంఖ్య   508105
ప్రధాన తపాలా కార్యాలయము రఘునాథపూర్ 
మొత్తము విస్తీర్ణము   2413 హెక్టార్లు
మొత్తం జనాభా  3,467
పురుష జనాభా  1,728
స్త్రీ జనాభా   1,739
గృహాలు   819
సమీప పట్టణము   భువనగిరి  (40 కి.మీ)
శాసన సభ నియోజకవర్గము    ఆలేరు
శాసన సభ్యులు    శ్రీమతి గొంగిడి సునీత
లోకసభ నియోజకవర్గము   భువనగిరి
లోకసభ సభ్యులు  శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సర్పంచ్  కంచర్ల శ్రీనివాస్ రెడ్డి

 

బొగుడ వెంకటేశ్వర స్వామి దేవాలయము

మండల ప్రధాన కార్యాలయం రాజపేట వైపు నుండి వచ్చే రహదారిలో, గ్రామ ప్రవేశం లో బోగుడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా వేంకటేశ్వర ఆలయం లో ప్రతి సంవత్సరం గ్రామస్తులు ఘనంగా జాతర నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ జాతరకు వేలాదిమంది భక్తులు హాజరవుతారు.