Sorry, you are not allowed to access this page
బొందుగుల
  • Ram Nath Kovind Our President
  • Narendra Modi Our Prime Ministe
  • SMT amilisai Soundararajan Our Governer
  • K Chandrashekar Rao Our Chief Minister
  • Komatireddy Venkat Reddy Our MP
  • Smt Gongidi Sunitha Our MLA

గంగదేవిపల్లి గురించి

గంగదేవిపల్లి గురించి

గంగదేవిపల్లి, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం ఒకప్పుడు మచ్చాపూర్  గ్రామ పంచాయతి పరిధిలో ఉండేది.1994,  సెప్టెంబరులో మచ్చాపూర్ నుంచి విడదీసి దీనిని ప్రత్యేక గ్రామ పంచాయతిగా ప్రకటించారు.  ఆనాటి నుంచి గ్రామస్థులంతా సంఘటితమై సమష్టి కృషితో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయనారంభించారు. దాని ఫలితమే2007లో ఈ గ్రామం నిర్మల్ జాతీయ పురస్కారం అవార్డు పొందినది. 1995, 2001 లలో జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికలలో సర్పంచుతో సహా వార్డు సభ్యులందరూ మహిళలే కావడం ప్రత్యేకత. ఇటీవలి కాలంలో అక్కడి విశేషాలు తెలుసుకోవడానికి అనేక రాజకీయ పార్టీల అధినేతలు ఈ ఆదర్శ గ్రామాన్ని పర్యటించించడంతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఈ గ్రామం ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.

గంగదేవిపల్లె గ్రామం జిల్లా కేంద్రమైన వరంగల్‌కు 12 కి.మీ. దూరంలో ఉంది. వూరి జనాభా 1277..

గ్రామ పంచాయతి ద్వారా గ్రామ పాలన నిర్వహించబడుతుంది.రెవెన్యూ హోదా లేని గ్రామ పంచాయితీ. 1994 సెప్టెంబరులో గంగదేవిపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతిగా ప్రకటించారు. అంతకు క్రితం ఇది మచ్చాపూర్ గ్రామ పంచాయతి పరిధిలో శివారు గ్రామంగా ఉండేది. 1995లో తొలిసారిగా మళ్ళీ ఐదేళ్ళ కాలపరిమితి ముగిశాక 2001లో రెండో సారి నిర్వహించిన గ్రామ పంచాయతి ఎన్నికలలో సర్పంచుతో సహా వార్డు సభ్యులందరూ మహిళలే ఎన్నిక కావడం ఈ గ్రామపు ప్రత్యేకత. 2006లో జరిగిన పంచాయతి ఎన్నికలలో రాజమౌళి సర్పంచుగా ఎన్నికైనాడు.

గంగదేవి పల్లె గ్రామస్థులు స్వయంకృషితో సాధించిన ప్రగతి, విజయాలు పలువురి మన్ననలు పొందాయి. 100% అక్షరాస్యత, 100% మధ్య నిషేధం, ఇంటింటికి 100% పారిశుద్య సదుపాయం, గ్రామంలో 100% కుటుంబాలలో కుటుంబ నియంత్రణ ఆ గ్రామం సాధించిన ప్రగతి సూచికలు. స్వయంకృషి, సామూహిక ప్రయత్నం ద్వారా సమస్యలను అధిగమించవచ్చునని, గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దుకోవచ్చునని ఈ గ్రామస్థులు నిరూపించారు. వూరిలో ప్రవేశించగానే ఇరువైపులా కనిపించే బోర్డులు వారి క్రమశిక్షణను, కట్టుబాటును చాటి చెబుతాయి

మధ్యం నిషిద్ధం, అంతా అక్షరాస్యులే, రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు గంగదేవిపల్లి ఘనతను చాటుతాయి. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి అభివృద్ధి వెనుక 14ఏళ్ల కృషి, 13 అభివృద్ధి కమిటీల శ్రమ ఉంది. ప్రతీ విషయంలో పారదర్శకత, పాలనలో ప్రతీ ఒక్కరికీ బాధ్యత వంటి విషయాలు గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపాయి. గంగదేవిపల్లి మొదట్లో మచ్చాపురం పంచాయతీ శివారు గ్రామంగా ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా గుర్తించారు. అప్పటికి ఊళ్లో నాటుసారా ఏరులై పారేది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. గ్రామస్థుల్లో ఆలోచన మొదలైంది. నాటుసారా విక్రయాలు నిషేధించారు. ఆరంభంలో ఒడిదుడుకులను అధిగమించారు. ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి గంగదేవిపల్లిని మినహాయించింది . గ్రామం దైనందిక పాలనలో కమిటీలు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర పైసా తీసుకోకుండా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేశారు. 1996 నుంచి డీ-ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరాటంకంగా పనిచేస్తోంది. ఇంటింటికీ 20లీటర్ల మంచినీరు రూపాయికే ఇస్తున్నారు. 1994కు ముందు గ్రామంలో పాఠశాల లేదు. అక్షరాస్యత అంతంత మాత్రమే. అందరికీ విద్య లక్ష్యంతో కమిటీ వేశారు. ప్రతీ 10 మంది నిరక్షస్యురాలకు ఒక వాలంటీర్ నియమించారు. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది. 2002 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించింది. బాల కార్మిక వ్యవస్థ లేదు. బడి ఈడు పిల్లలంతా చదువుకోవాల్సిందే.గంగదేవిపల్లిలో కేబుల్ ప్రసారాలు ఉచితం. ఒక్కసారి రూ.2,200 చెల్లిస్తే చాలు. వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వడ్డీతో గంగా డిష్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రుణాల రికవరీ కమిటీ, 'గ్రామాభివృద్ధి కమిటీ'... ఇలా 13 కమిటీలున్నాయి. ప్రతీ ఇంటి నుంచి ఒకరికి ఏదో ఒక కమిటీలో బాధ్యతలుంటాయి. రాజకీయ పార్టీలున్నా అభివృద్ధి నిర్ణయాల్లో అందరిదీ ఒకటే మాట. గంగదేవిపల్లిలో కుటుంబ సమస్య ఉన్నా పంచాయతీ కార్యాలయం దాటి వెళ్లదు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా పోలీసు రాలేదు. కొట్లాట కేసు కూడా నమోదు కాలేదు.

మొత్తం గ్రామంలో 13 కమిటీలున్నాయి. గ్రామాన్ని 18 భాగాలుగా విభజించారు. ఒక్కో కమిటీలో 11 నుండి 25 వరకు సభ్యులుంటారు. ప్రతి ఇంటి నుండి ఏదో ఒక కమిటీలో ప్రతినిధులున్నారు.[3]

  • మద్యపాన నిషేధ కమిటీ - గ్రామంలో మద్యం వినియోగం కాకుండాను, ప్రక్క గ్రామాలనుండి అక్రమంగా తరలి రాకుండాను.
  • మంచినీటి నిర్వహణ కమిటీ - ఇంటింటికీ నీటి సరఫరా, కుళాయిల చుట్టూ పారిశుధ్యం. లోఢీ సంస్థ సాయంతో మంచి నీటి ట్యాంకులు, టాటా కంపెనీ సాయంతో ఫ్లోరైడ్ రహిత నీటి ప్రాజెక్టు రూపొందించుకొన్నారు .[4] రూపాయికి 20 లీటర్లు నీరు అందిస్తారు. ప్రక్క గ్రామాలవారు అందుకు రెండు రూపాయలు ఇవ్వాలి. ఈ కమిటీ ఆదాయం ఇతర అభివృద్ధి పనులకు కూడా కీలకం.
  • విద్యా కమిటీ - పాఠశాల నిర్వహణ, మరమ్మతులు వగైరా.
  • గంగా డిష్ కమిటీ - కేబుల్ కనెక్షన్ పని- ఒక్కమారు 2,200 చెల్లిస్తే నిరంతరాయంగా కేబుల్ ప్రసారాలు. నెలసరి ఛార్జీలు లేవు.
  • ఆరోగ్య కమిటీ - ఆరోగ్య పరిరక్షణ, సీజన్లలో వచ్చే వ్యాధుల గురించి ముందు జాగ్రత్త, కుటుంబ నియంత్రణ
  • తల్లుల కమిటీ - అంగన్ వాడీకి అనుబంధంగా - గర్భిణీ, బాలింతల అవసరాలను చూస్తారు.
  • రికవరీ కమిటీ - వ్యవసాయ ఋణాలను బ్యాంకులకు సక్రమంగా చెల్లించే పని అజమాయిషీ.
  • గ్రామాభివృద్ధి కమిటీ - అన్ని అభివృద్ధి కార్యక్రమాలు.

గంగదేవిపల్లె పురోగతిలో కూసం రాజమౌళి, గోనె చేరాలు, కూసం లింగయ్య, చల్ల మల్లయ్య, కూసం నారాయణ, పెళ్ళి రాజయ్య వంటి వారు ప్రముఖమైన స్థానం వహించారు. తన అనుభవాన్ని రాజమౌళి ఇలా చెప్పాడు - "మొదట్లో ప్రజలందరినీ ఒకే త్రాటిపైకి తేవడం కాస్త కష్టమయ్యింది. అలాగని మేము ప్రయత్నాలు ఆపలేదు. అభివృద్ధి ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలియజెప్పడానికి ప్రయత్నించాం. కొన్నాళ్ళకి వారిలోనూ చైతన్యం వచ్చింది. ప్రతి పనికీ స్వచ్ఛందంగా ముందుకు రాసాగారు. ప్రతీ నిర్ణయానికీ వోటింగ్ పెడతాం. మెజారిటీ సభ్యుల అభిప్రాయమే అంతిమ తీర్పు. ప్రజలందరూ ఏదో ఒక కమిటీలో సభ్యులు. కనుక ఏ పని మొదలు పెట్టినా ఇది నాది అనే బాధ్యతతో పని చేస్తారు. ఈ విజయాలన్నీ ఏ ఒక్కరో సాధించినవి కావు. ఈ ఘనత గ్రామ ప్రజలందరిదీను"[3]

1995 నుండి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలన్నీ ఏకగ్రీవాలే. 1995 నుండి పదేళ్ళపాటు వార్డు మెంబరు నుండి సర్పంచ్ వరకూ అందరూ మహిళలే ఎన్నికయ్యారు. వూళ్ళో మొత్తం 14 పొదుపు సంఘాలున్నాయి. ప్రతీ ఇంటి నుండి ఒక మహిళయినా ఏదో ఒక సంఘంలో సభ్యత్వం తీసుకోవడం తప్పనిసరి.

  • గంగదేవిపల్లి 2007లో దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం ఈ ఎంపిక చేసింది. గ్రామీణ భారత అధ్యయనం, పరిశోధనా అకాడమీ ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ ముఖ్య సలహాదారు.
  • గంగదేవిపల్లి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏ పి జె అబ్దుల్  కలామ్ చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కార్ అందుకుంది.
  • వరంగల్ జిల్లాలో నాలుగుసార్లు ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది.
  • గ్రామంలోని కుటుంబాలన్నీ చిన్న మొత్తాల పొదుపులో చేరినందుకు 1999లో కలెక్టర్ ప్రత్యేక అవార్డు అందించారు.
  • కెనడా, బంగ్లాదేశ్‌ల నుంచి స్వచ్ఛంద సంస్థలు వచ్చి గంగదేవిపల్లి గ్రామస్వరాజ్యాన్ని అధ్యయనం చేశాయి. తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్థాన్ బృందాలూ వచ్చాయి. ఇతర జిల్లాల బృందాలకు లెక్కేలేదు. జిల్లాకు వచ్చే ఐఏఎస్ శిక్షణార్థులంతా ఈ గ్రామం గురించి చదవాల్సిందే.[5]
  • "దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఇలాంటి గ్రామం ఒకటి ఉండాలి" - అని 2005లో గ్రామాణికి వచ్చిన పంచాయితీ కమిషనర్ చెల్లప్ప ప్రశంసించాడు.[3]
  • ఆంధ్రా బ్యాంకు  వారు ఈ గ్రామాన్ని "పట్టాభి ఆదర్శ గ్రామం అభివృద్ధి ప్రణాళిక" క్రింద దత్తత తీసుకొన్నారు

 " మధ్య నిషేధం తొలి అడుగు... తాగునీటి సమస్య పరిష్కారం మరో ముందడుగు. ... క్రమ శిక్షణ .. కట్టుబాట్లు ... దిద్దుబాట్లు ... ప్రగతి రథ చక్రాలు. ప్రజలే సారధులు. అభివృద్ధి ఫలాలకు వారసులు. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్న ఇలాంటి పట్టుగొమ్మలు అందుకోసం కలలు గన్న మహాత్మునికే కాదు. మనందరికీ గర్వ కారణమే, స్ఫూర్తి దాయకమే"